
Special Health Camps for Women in Hyderabad
మహిళలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయండి జిల్లాలో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడండి సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టండి జిల్లా లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మందుల కొరత లేకుండా చూడాలి జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మహిళలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి వైద్య అధికారులను ఆదేశించారు. బుధవారం సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై జిల్లా వైద్యాధికారుల తో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ […]
మహిళలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయండి
జిల్లాలో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడండి
సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టండి
జిల్లా లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మందుల కొరత లేకుండా చూడాలి
జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి
మహిళలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి వైద్య అధికారులను ఆదేశించారు.
బుధవారం సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై జిల్లా వైద్యాధికారుల తో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాలని వైద్యాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక మహిళా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య అధికారులకు సూచించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని తెలుపుతూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రైవేటుకు ధీటుగా వైద్యం అందాలని అవుట్ పేషంట్ సంఖ్య పెంచాలని సూచించారు. ప్రభుత్వ ప్రవేట్ పాఠశాలు కళాశాలలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే ఆసుపత్రులతో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, నీటి కొరత లేకుండా చూడాలని సూచించారు. ఇమ్యునైజేషన్ కార్యక్రమం ద్వారా టీకాలు అందించాలని, రక్తహీనతతో ఉన్న గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలో, కళాశాలలో ఒత్తిడితో ఉన్న విద్యార్థులను గుర్తించి సైకాలజీ వైద్యులచే అవగాహన కల్పించాలని వైద్యులకు సూచించారు. జిల్లాలో ఉన్న బస్తీ దావఖానాలలో మెరుగైన వైద్య చికిత్సలు అందాలని ఓపి శాతం కూడా పెరగాలని సూచించారు. మత్తు పదార్థాలు స్వీకరించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ డి -ఎడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్సలు అందించాలని సూచించారు.
తదుపరి ఎంసిహెచ్ కిట్లు, ఇమ్యూనైజేషన్, ఆరోగ్య మహిళా, కుటుంబ నియంత్రణ, బస్తీ దహఖానాల పనితీరు, సీజనుల వ్యాధులు తదితర అంశాలపై డి ఎం అండ్ హెచ్ ఓ తో కలిసి సమీక్షించారు.
ఈ సమావేశంలో డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వెంకటి, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ చల్లా దేవి, అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ జయమాలిని, డాక్టర్ సరస్వతి, డి ఐ ఓ డాక్టర్ పి శ్రీధర్, ఆరోగ్యశ్రీ డిస్టిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ సాయి నారాయణ గౌడ్ , వైద్యులు తదితరులు పాల్గొన్నారు