
Prajavani applications should be resolved promptly.
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారి నుండి147 దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో 147 దరఖాస్తులు రాగా అందులో హౌసింగ్ శాఖ 77( 2బి.హెచ్.కె 48, ఇందిరమ్మ ఇండ్లు 29), పెన్షన్స్ 7, కలెక్టరేట్ సెక్షన్లు 16, రెవిన్యూ 13, ఇతర శాఖలు 34 కలవని అదనపు కలెక్టర్ తెలిపారు. అర్జీదారుల దరఖాస్తులలో పేర్కొన్న సమస్యల […]
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారి నుండి147 దరఖాస్తులను స్వీకరించారు.
ప్రజావాణిలో 147 దరఖాస్తులు రాగా అందులో హౌసింగ్ శాఖ 77( 2బి.హెచ్.కె 48, ఇందిరమ్మ ఇండ్లు 29), పెన్షన్స్ 7, కలెక్టరేట్ సెక్షన్లు 16, రెవిన్యూ 13, ఇతర శాఖలు 34 కలవని అదనపు కలెక్టర్ తెలిపారు.
అర్జీదారుల దరఖాస్తులలో పేర్కొన్న సమస్యల పై క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కదిరవన్ పలని,జి ముకుంద రెడ్డి డీ.ఆర్.ఓ ఈ. వెంకటాచారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.